INDvsWI : భారత్ ఓటమి

Sovereign special cricket ball (cricket ball)

బార్బోడస్ (జూలై – 30) : భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరులో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ కు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55) శుభమన్ గిల్ (34) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో 181 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్, మోటీ తలో మూడు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు హోప్ (63) కార్తీ (48) రాణించడంతో సునాయాసంగా లక్ష్యాన్ని చేదించి గెలుపొందింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హోప్ నిలిచాడు. 3 వన్డేల సిరీస్ 1-1 తో సమానంగా ఉంది మూడో వన్డే ఫలితం సిరీస్ విజేతను తేల్చనుంది.