WIvsIND : భారత్ 438 ఆలౌట్

ట్రినిడాడ్ (జూలై – 21) : భారత్ – వెస్టిండీస్ జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (121), రోహిత్ శర్మ (80), రవీంద్ర జడేజా (61), జైశ్వాల్ (57), అశ్విన్ (56) పరుగులతో రాణించారు.

వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3, వారికన్ 3, హోల్డర్ – 2 వికెట్లు తీశారు.

ఇది భారత్ – వెస్టిండీస్ జట్ల మద్య జరుగుతున్న 500 టెస్ట్ మ్యాచ్, కాగా విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్.

విరాట్ కోహ్లీ టెస్టులో 29వ టెస్ట్ సెంచరీ సాదించాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కి 76వ సెంచరీ కావడం విశేషం.

రెండోరోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 86/1 పరుగులతో నిలిచింది.