INDvsPAK : నిలబెట్టిన ఇషాన్, హర్దీక్

పల్లెకలె (సెప్టెంబర్ – 02) : ASIA CUP 2023 లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (INDvsPAK) లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (ishan kishan and Hardik Pandya) రాణించడంతో గౌరవప్రద స్కోర్ (266) ను పాకిస్థాన్ ముందు ఉంచారు. పాకిస్థాన్ లక్ష్యం 267 పరుగులు.

66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టు ను ఇషాన్ కిషన్ (82) హార్దిక్ పాండ్యా (87) పరుగులతో రాణించి పోరాడే స్కోరును సాధించి పెట్టారు.

పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది (Saheen Afridi) – 4, హరీష్ రౌఫ్ 3 వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పాకిస్తాన్ బౌలర్ల దాటికి నిలవలేకపోయారు. టాప్ త్రీ బ్రాట్స్మన్ క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం.