INDvsAUS : భారత్ ఘనవిజయం

  • అన్ని క్రికెట్ పార్మాట్ లలో టీమిండియా నెంబర్ 1
  • మహ్మద్ షమి 5 వికెట్లతో రాణింపు.
  • అర్ద సెంచరీలతో రాణించిన గైక్వాడ్, గిల్‌, సూర్య, రాహుల్.
  • సిరీస్ లో 1-0 తేడాతో ముందంజ.

మోహలీ (సెప్టెంబర్ – 22) : INDvsAUS – బారత్, ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం (india won the 1st one day against Australia) సాధించింది.

కోహ్లీ, రోహిత్ లేకున్నా బ్యాటింగ్ ఆర్డర్ బలం తగ్గలేదు అనేలా సునాయాసంగా ఆస్ట్రేలియా పై విజయం సాధించి 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యత పొంది ప్రపంచ కప్ కు ముందు నూతన ఉత్సాహం సాదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహ్మద్ షమీ ధాటికి 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాట్స‌మన్ లలో వార్నర్ (52), యింగ్లీష్ (45), స్మిత్ (41) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు, బుమ్రా, జడేజా, అశ్విన్ తలో వికెట్ తీశారు.

అనంతరం 277 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు గైక్వాడ్ (71), గిల్ (74) పరుగులతో బలమైన పునాది వేశారు. మద్యలో జంపా (2 వికెట్లు) హడవుడి చేసిన కెఎల్ రాహుల్ (58), సూర్య కుమార్ యాదవ్ (50) రాణించడంతో భారత్ సునాయాసంగా లక్ష్యం ఛేదించింది.