Home > 6 GUARANTEE SCHEMES > ఇందిరమ్మ ఇళ్ళు పథకం – ప్రాథమిక అర్హతలు ఇవే

ఇందిరమ్మ ఇళ్ళు పథకం – ప్రాథమిక అర్హతలు ఇవే

BIKKI NEWS (MARCH 08) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇళ్ళు ముఖ్యమైనది. ఈ పథకం మొదటి దశను మార్చి – 11 వ తేదీన ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని (INDIRAMMA ILLU SCHEME GUIDELINES ) ఈ సందర్భంగా మంత్రి అన్నారు.

బుధవారం సచివాలయంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులతో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకంపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఈ నెల 11న భద్రాచలం రామయ్య సన్నిధిలో ఐదో గ్యారెంటీ కింద సీఎం రేవంత్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.

★ ప్రాథమిక అర్హతలు

సొంత ఇళ్ళు లేనివారికి మాత్రమే ఈ పథకం అమలు కానుంది.

ఇల్లు లేని వారికి స్థలం ఇవ్వడంతోపాటు స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్లను 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా నిర్మించాలని, ఒక హాలు, బెడ్‌రూం, వంట గది, బాత్‌రూమ్‌ ఉండాలని తెలిపారు.

తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, ఆయా ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తామని తెలిపారు

అదే విధంగా మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికే పథకం కింద రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్పారు.

పథకం మార్గదర్శకాలను విడుదల చేయాలని అధికారులకు సూచించారు.

పథకాన్ని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.