పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ తన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ పై 107 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. పాకిస్థాన్ పై ఆడిన 11 వన్డేలకు గానూ 11 వన్డే లు గెలిచిన భారత్.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 244/7 స్కోర్ చేసింది. భారత్ తరపున పూజ 67, స్నేహ 53, స్మృతి మంధన 52 పరుగులు చేశారు.

అనంతరంబ్యాటింగ్ ఆరంభించిన పాకిస్థాన్ జట్టు ఏ దశలోను పోరాటం చూపలేదు. 137 పరుగులకే ఆలౌట్ అయింది.రాజేశ్వరి 4 వికెట్లు సాదించింది.

ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ గా 67 పరుగులు చేసిన పూజ నిలిచింది.

Follow Us @