బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక సాయం

  • ఓవర్సీస్ విద్యానిధి పథకం
  • దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31

మహత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్స్ లలో డిగ్రీ పూర్తి చేసి, 60 శాతంపైగా మార్కులు సాధించిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 35 ఏండ్లకు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.

వివరాలకు telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ను సందర్శించాలి.

Follow Us @