INDvsWI : భారత్ ఘనవిజయం – సిరీస్ సొంతం

ట్రినిడాడ్ (ఆగస్టు – 02) : భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో భారత జట్టు 200 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. (India won the one day series against westindies with 2-1)

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 351 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు ఇసాన్ కిషన్ (77) శుభమన్ గిల్(85) నిలకడగా అర్థ సెంచరీలతో రాణించడంతో గట్టి పునాది పడింది. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ (51), హర్దీక్ పాండ్యా (70) రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు కేవలం 151 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లు మొతీ (39), జోసెఫ్ (26) చేసినవే అత్యధిక పరుగులు కావడం విశేషం. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (4), ముకేష్ కుమార్ (3), కులదీప్ యాదవ్ (2) వికెట్లు తీశారు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభమన్ గిల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. భారత ఓపెనర్ కిషన్ కిషన్ 3 వన్డే ల లోను 50 కి పైగా స్కోర్లు చేయడం విశేషం.