INDvsWI : టీమిండియా ఘన విజయం

ప్లొరిడా (ఆగస్టు – 12) : భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న కీలకమైన నాలుగో టీట్వంటీ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో భారత్ గెలవడంతో 5 టీ20ల సిరీస్ ఇప్పుడు 2 – 2 తో సమం అయింది. ఐదో టీట్వంటీ లో గెలిచిన జట్టు సిరీస్ ను గెలుచుకోనుంది.

179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని చేదించింది. యశస్వి జైశ్వాల్ (84), శుభమన్ గిల్ (77) ధాటిగా ఆడి తొలి వికెట్ కు 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.

మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ హెట్‌మెయర్ (61), హోప్ (45) రాణీంచడంతో భారీ స్కోరు 178 నమోదు చేసింది.

భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, కులదీప్ యాదవ్ – 2 వికెట్లు తీశారు.