డొమినికా (జూలై – 13) : వెస్టిండీస్ – భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల దాటికి 150 పరుగులకే ఆలౌట్ అయింది.
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లలో అతాంజే 47, బ్రాథ్‌వేట్ 20 పరుగులతో రాణించారు.భారత స్పిన్ ద్వయం అశ్విన్ 5 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లతో వెస్టిండీస్ ను కుప్పకూల్చారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 40, కెప్టెన్ రోహిత్ శర్మ 30 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసి 70 పరుగులు వెనకబడి ఉంది.
◆ Ravichandran Ashwin : అంతర్జాతీయ క్రికెట్ లో 700 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో తండ్రిని, కొడుకును ఔట్ చేసిన 5వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్ట్ లో శివనారయణ్ చంద్రపాల్ కొడుకు తగినరైన్ చంద్రపాల్ ను ఔట్ చేయడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు.
★ మరిన్ని వార్తలు