INDvsWI : భారత్ భారీ స్కోర్

ట్రినిడాడ్ (ఆగస్టు – 01) : భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 351 పరుగులు చేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు భారత జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది.

భారత ఓపెనర్లు ఇసాన్ కిషన్ (77) శుభమన్ గిల్(85) నిలకడగా అర్థ సెంచరీలతో రాణించడంతో గట్టి పునాది పడింది. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ (51), హర్దీక్ పాండ్యా (70) తో భారత్ భారీ స్కోర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు కూడా దూరంగా ఉండటంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు.