ట్రినిడాడ్ (జూలై – 24) : భారత్ వెస్టిండీస్ ల మద్య జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 76/2 తో ఉండి… ఇంకా 289 పరుగుల దూరంలో ఉంది. చివరి రోజు ఆట ఎవరిదో…
రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్‌మన్ టీట్వంటీ తరహాలో రెచ్చిపోతూ బజ్ బాల్ క్రికెట్ ఆడారు. కేవలం 24 ఓవర్లలో 7.54 రన్‌రేట్ తో 181/2 వద్ద డిక్లర్ చేశారు. రోహిత్ తన టెస్ట్ కెరీర్లో అత్యంత వేగవంతమైన అర్ద సెంచరీ నమోదు చేశారు. ఇషాన్ కిషన్ కూడా అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ జట్టు 76/2 పరుగులతో నాలుగో రోజు ఆట ముగించింది. ఆశ్విన్ 2 వికెట్లు తీశాడు.
4వ రోజు వెస్టిండీస్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ సిరాజు – 5, ముఖేష్ కుమార్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు చేసిన విషయం తెలిసిందే.