BIKKI NEWS (NOV. 15) : INDIA vs SOUTH AFRICA 4th T20 match. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీట్వంటీ లో టీమిండియా బ్యాట్స్ మన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. భారీ సిక్సర్స్ తో విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో వికెట్ కోల్పోయి 283 పరుగులు సాదించింది.
INDIA vs SOUTH AFRICA 4th T20 match
సంజూ శాంసన్ 51 బంతుల్లో సెంచరీ (109) మరియు తిలక్ వర్మ 41 బంతుల్లో సెంచరీ (120) లతో రాణించడంతో భారత్ భారీ స్కోరు ను సాదించింది. సంజూ శాంసన్ కు గత 5 అంతర్జాతీయ టీట్వంటీ లలో ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
అలాగే తిలక్ వర్మకు వరుసగా రెండో టీట్వంటీ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. అలాగే వరుసగా రెండు మ్యాచ్ లలో సెంచరీలు కొట్టిన రెండో భారత బ్యాట్స్‌మన్ గా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. మొదటి భారత బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్. అంతర్జాతీయంగా 5వ బ్యాట్స్‌మన్ గా తిలక్ వర్మకు స్థానం దక్కింది.
అలాగే టీమిండియా అంతర్జాతీయ టీట్వంటీ లలో అత్యధికంగా 297 పరుగులను ఇంతకు ముందు బంగ్లాదేశ్ పై సాదించింది. ఈ రోజు 283 పరుగులు సాదించి రెండో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది.
ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 23 సిక్సర్స్ కొట్టిన టీమిండియా బ్యాట్స్ మన్ గతంలో బంగ్లాదేశ్ పై కొట్టిన అత్యధిక సిక్సర్ల (22) రికార్డు ను బద్దలు కొట్టారు.
సంక్షిప్త స్కోర్
టీమిండియా : 283/1
అభిషేక్ శర్మ – 36
సంజూ శాంసన్ – 109* (56)
తిలక్ వర్మ – 120* (47)