ముంబై (నవంబర్ – 15) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు ముంబై వాంఖడే స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ (INDIA vs NEWZELAND SEMIFINAL MATCH) లో మహ్మద్ షమీ (7/57) విజృంభించి బౌలింగ్ వేయడంతో భారత్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరింది. 2019 సెమీఫైనల్ ఓటమికి ప్రతికారం తీర్చుకుంది.
398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మాచెల్ భారీ సెంచరీ (134), విలియమ్స్ సన్ (69), ఫిలిప్స్ – (41) పరుగులతో రాణించడం తో భారీ లక్ష్యం కూడా చిన్నగా అనిపించింది. అయితే మహ్మద్ షమీ వరుస బంతుల్లో విలియమ్స్ సన్, లాథమ్ లను ఔట్ చేయడంతో భాథత్ గెలుపు బాట పట్టింది. బుమ్రా సిరాజ్, కులదీప్ తలో వికెట్ తీశారు.
వరల్డ్ కప్ చరిత్రలో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. అలాగే ఈ వరల్డ్ కప్ లో 23 వికెట్లు తీసి తొలి స్థానంలో నిలచాడు. అలాగే వరల్డ్ కప్ చరిత్రలోనే 5 వికెట్లు 4 సార్లు తీసిన ఒకేఓక బౌలర్ గా షమీ రికార్డు సృష్టించాడు. అత్యధిక పరుగులతో కోహ్లీ (711) తొలి స్థానంలో ఉన్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 397/4 పరుగులు సాదించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు 50వ సెంచరీ (117), శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ (105) సాదించారు. మొదట్లో రోహిత్ శర్మ (47) మెరుపు ఆరంభం, శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్ (80*), చివర్లో రాహుల్ ( 39*)కీలక పరుగులు చేయడంతో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా భారత్ భారీ స్కోరు సాధించింది. సౌథీ 3 వికెట్లు తీశాడు.
లీగ్ దశ నుంచి ఏ ప్రణాళికతో అయితే భారత్ విజయాలు సాదిస్తుందో అదే ప్రణాళికను విజయవంతంగా సెమీఫైనల్ లో కూడా అమలు చేసి భారత్ విజయవంతం అయింది.