BIKKI NEWS (JAN. 12) : INDIAN SPACE STATION WILL LAUNCHED ON 2028 ప్రస్తుతమున్న లాంఛర్ సామర్థ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు వెల్లడించారు. 10వ వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో భాగంగా గాంధీనగర్‌లో ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ అంశంపై గురువారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ఆర్థిక కార్యకలాపాలకు అంతరిక్ష కేంద్రం దోహదపడేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.