POVERTY REPORT – భారత్ లో పేదరికం పై ప్రపంచ బ్యాంకు రిపోర్ట్

BIKKI NEWS (JUNE 08) : india poverty report by world bank. భారతదేశంలో “తీవ్ర పేదరికం రేటు” గడిచిన దశాబ్ద కాలంలో భారీగా తగ్గిందని తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది.

india poverty report by world bank.

2011 – 12 లో భారతదేశంలో పేదరికం రేటు 16.2% ఉండగా 2022 – 23 నాటికి అది 2.3 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది.

ప్రపంచ బ్యాంక్ పేదరిక సూత్రీకరణ ప్రకారం రోజుకు 3 డాలర్లు (257 రూపాయాలు) సంపాదించిన వాళ్లు పేదలు కాదు. 3 డాలర్ల లోపు సంపాదన కలిగిన వారిని ప్రపంచ బ్యాంకు పేదవారీగా గుర్తిస్తుంది.

భారతదేశంలో 2011 – 12 లో దారిద్ర రేఖకు దిగువన 34 కోట్ల మంది జనాభా ఉండగా 2022 – 23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు తగ్గిందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.

2024 లో భారత్ లో పేదరిక 5.44 శాతంగా (5.46 కోట్ల మంది) ఉన్నట్లు పేర్కొంది.

2011 – 2012 నుంచి 2022 – 23 ల మద్య 17.1 కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు.

54% మంది పేదలు అత్యధిక జనాభా కలిగిన ఐదు రాష్ట్రాలలో ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైన పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గింది.

పట్టణ ప్రాంతాలలో పేదరికం 10.7% నుంచి 1.1% కు తగ్గింది.

పల్లెలు పట్టణాల మధ్య పేదరిక అంతరం 7.7% నుంచి 1.7 శాతానికి తగ్గిపోయింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు