Home > LATEST NEWS > PLANE CRASH – అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ మృతి

PLANE CRASH – అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ మృతి

BIKKI NEWS (JUNE 12) : India plane crash all passengers are dead. అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఎయిర్ ఇండియా A171 బోయింగ్ విమాన ప్ర‌మాదంలో అందరు ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందినట్లు, ప్ర‌మాదం నుంచి ఎవ‌రూ బ్ర‌తికిన‌ట్లు లేర‌ని అహ్మ‌దాబాద్ పోలీసు క‌మీష‌న‌ర్ జీఎస్ మాలిక్ తెలిపారు.

India plane crash all passengers are dead

ఇదే విమానంలో ప్ర‌యాణిస్తున్న మాజీ సీఎం విజ‌య్ రూపానీ మృతిచెందిన‌ట్లు గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఈ విమానంలో 242 మంది మ‌ర‌ణించారు. 232 మంది ప్ర‌యాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది భార‌తీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడు మంది పోర్చుగీస్‌, ఓ కెన‌డా దేశ‌స్థుడు ఉన్నారు.

విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్ష‌ణాల్లోనే ఆ విమానం కూలింది. రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో విమానం కూల‌డం వ‌ల్ల అద‌నంగా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

అయితే బోయింగ్ డ్రీమ్‌లైన‌ర్ ప్ర‌మాదం వ‌ల్ల మొత్తం ఎంత మంది చ‌నిపోయార‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, దానిపై త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు