BIKKI NEWS (MAY 10) : INDIA PAKISTAN WAR CEASEFIRE. భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రారంభమైన యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు, తక్షణ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రీట్ చేశారు.
INDIA PAKISTAN WAR CEASEFIRE
భారత్ పాకిస్తాన్ లకు చెందిన ప్రధాన మంత్రులతోనూ మరియు ఉన్నతాధికారులతోనూ మాట్లాడినట్లు మార్క్ రూబియో కూడా ట్వీట్ చేశారు.
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ… శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ డీజీఎంవో, భారత డీజీఎంవో మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయని, రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయని మిస్రీ వెల్లడించారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారని చెప్పారు. ఈ సాయంత్రం నుంచి భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
TRUMP TWEET
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్