హైదరాబాద్ (డిసెంబర్ – 24) : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) భారత వృద్ధి రేటు ను 2022-23 కు 6.8%, 2023 – 24 కు 6.1% గా ఉంటుందని అంచనా వేసింది. అలాగే ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా ఈ ఏడాది, వచ్చే ఏడాది 0.5 శాతం మేర ఉంటుంద’ని వివరించారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయంగానే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న ప్రస్తుత తరుణంలోనూ, భారత్ వృద్ధి బాగానే ఉందని ఐఎంఎఫ్ ఇండియా మిషన్ చీఫ్ చెయిరీ నాడా తెలిపారు.