INDvsAUS : భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా

రాజ్‌కోట్ (సెప్టెంబర్ – 27) : భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ 352 /7 ను నమోదు చేసింది.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో మిచెల్ మార్క్స్ (96), స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72), డేవిడ్ వార్నర్ (56) పరుగులతో రాణించారు.

భారత బౌలింగ్ లో బుమ్రా 3, కులదీప్ యాదవ్ – 2, సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒకొక్క వికెట్ తీశారు.

3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే భారత్ మొదటి రెండు వన్డేలో గెలిచి 2-0 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకుంది.