కేంద్ర ఉపకార వేతనాల ఆదాయ పరిమితి పెంపు

కేంద్ర ప్రభుత్వ అందించే ఉపకార వేతనాలకు ఓబీసీ, ఈబీసీ, డీ.ఎన్.టీ కేటగిరీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుతూ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

పరిమితి పెంచాలని గతేడాది జులై లోనే కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

  • ఓబీసీ విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు వార్షికాదాయ పరిమితి రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు,
  • డాక్టర్ అంబేడ్కర్ ఈబీసీ పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు రూ. లక్ష నుంచి రూ.2.5 లక్షలకు,
  • డాక్టర్ అంబేడ్కర్ డీఎన్టీ ప్రీ-పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు రూ. 2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పరిమితిని ప్రభుత్వం పెంచింది.
Follow Us @