10 జట్లతో IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో మరో రెండు కొత్త జట్లు కలవనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈరోజు జరిగిన బీసీసీఐ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది జట్లతో ఉన్నా ఐపీఎల్ 2022 నుండి 10 జట్లతో జరగనుంది

ఈ రెండు జట్ల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఎనిమిది జట్లతో 60 మ్యాచ్ లు జరగనుండగా, 2022 నుండి 10 జట్లతో 94 మ్యాచ్ లతో లీగ్ జరగనుంది.

ఐపీఎల్ కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని టీమ్ లు మరియు మ్యాచ్ ల సంఖ్య పెంచడానికి బిసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Follow Us@