ఎంసెట్ రాయలంటే ఇంటర్ లో 45% మార్కులు తప్పనిసరి

హైదరాబాద్ (ఫిబ్రవరి 12) : తెలంగాణ ఎంసెట్ కు హాజరయ్యేందుకు ఇంటర్ 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. జనరల్ క్యాటగిరీ విద్యార్థులు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, రిజర్వేషన్ క్యాటగిరీ వారు 40 శాతం మార్కులు తప్పనిసరిగా సాదించాల్సి ఉంటుంది.

కరోనా ప్రభావం వల్ల 2021, 2022 విద్యా సంవత్సరాలలో ఈ నిబంధన నుంచి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. కరోనా లేకపోవడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండటం, 100 శాతం సిలబస్ తో అన్ని పరీక్షలు జరుగుతుండటంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వబోమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు.