Home > JOBS > DSC (TRT) > TG DSC – డీగ్రీలో 40% మార్కులన్నా టీచర్ పోస్టులకు అర్హులే

TG DSC – డీగ్రీలో 40% మార్కులన్నా టీచర్ పోస్టులకు అర్హులే

BIKKI NEWS (JUNE 14) : తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ లో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు (in degree 40 % of marks are telugu le for teacher posts )జారీ చేశారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీచేశారు.

ఇప్పటి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ (SA), భాషా పండిట్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు (PET) వంటి పోస్టులకు జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి ఇతర కేటగిరి అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన ఉండేది. అయితే… దానిని తాజాగా 45 శాతం, 40 శాతానికి కుదిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.