BIKKI NEWS (JAN. 26) : IMRAN KHAN got Best Lecturer Award. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం రోజు జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ చేతుల మీదగా కోరుట్ల జూనియర్ కళాశాలకు చెందిన హిందీ జూనియర్ లెక్చరర్ డాక్టర్. ఎం.డి. ఇమ్రాన్ ఖాన్ ఉత్తమ లెక్చరర్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
IMRAN KHAN got Best Lecturer Award
ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల, రాయికల్ కళాశాల యందు హిందీ లెక్చరరుగా పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పలువురు పెద విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందించి ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా కోరుట్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి. గౌస్ రెహ్మాన్, తోటి అధ్యాపకులు, విద్యార్థులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్