కళాశాల విద్యా బోధనలో చరిత్ర పాఠ్యంశం తప్పనిసరి చెయ్యాలి – పోతరవేని తిరుపతి

తెలంగాణలో ప్రతి విద్యార్థికి తెలంగాణ చరిత్ర సంస్కృతి పట్ల చారిత్రక అవగాహన పెంపొందించుటకై, తెలంగాణ ఉద్యమ చరిత్రను బావి తరాలకు అందించుటకు చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు చరిత్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పోతరవేని తిరుపతి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా చరిత్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పోతరవేని తిరుపతి మాట్లాడుతూ విద్యాబోధనలో చరిత్ర లేనిదే మానవవికాసం గురించి తెలిసే అవకాశమే వుండదు. కావున ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో అన్ని కోర్సుల (ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ కోర్సులు) యందు చరిత్ర పాఠ్యంశంను తప్పనిసరిగా అభ్యసించే విధంగా పాఠ్యప్రణాళికలు రూపొందించాలని, చరిత్రను ఔద్యోగిక విద్యగా భావించే, గణితం, సైన్స్ మరియు కంప్యూటర్ విద్యతో కలిపి బోధించే ఏర్పాటు కావాలని.. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం, ఏయిడెడ్, రెసిడెన్సీయల్ మరియు ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల స్థాయి విద్యలోని అన్ని గ్రూపుల వారికి చరిత్రను ఒక తప్పనిసరి సబ్జెక్టుగా బోధించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.