అస్సాం తరహలో కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రయోజనాల కల్పించాలి – హరీష్ రావు తో కనకచంద్రం

సిద్దిపేట జూనియర్ కళాశాల బాలుర సందర్శించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల తరపున ఈరోజు TGCLA అధ్యక్షుడు కనక చంద్రం ఆద్వర్యంలో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా అద్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్ మరియు నగేష్ లు అస్సాం రాష్ట్రంలో కాంట్రాక్ట్ టీచర్లకు రెగ్యులర్ టీచర్లతో సమానంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను కల్పించిందని, కావునా అదే పద్దతిలో జూనియర్ అధ్యాపకుల సర్వీస్ ను క్రమబద్ధీకరించే వరకు తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా అన్ని రకాల ప్రయోజనాలను కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

అలాగే ప్రభుత్వం బదిలీలపై నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు కచ్చితంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో అన్ని రకాల ప్రయోజనాలను అందించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో TGCLS రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం సిరిసిల్ల శ్రీను, నగేష్, శ్రీనివాస్ రెడ్డి, కట్టయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

Follow Us @