ఇంటర్ విద్యార్థులను ఐసర్ లో అడ్మిషన్లకు సమయాత్తం చేయాలి – ఇంటర్ కమీషనర్ తో వినోద్ కుమార్

జాతీయ సైన్స్ డే సందర్భంగా సోమవారం రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్, ఎంఎస్ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ విద్యార్ధులను సమాయత్తం చేయాలని సూచించారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) విద్యా సంస్థల్లో బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ (B.S ), మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.S.) కోర్సుల్లో అడ్మిషన్లకు అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఐసర్’ అటా నమస్ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బెర్హంపూర్, భోపాల్, కోల్ కతా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ఈ సంస్థలు ఉన్నాయని చెప్పారు.

ఇంటర్ ఎంపీసీ, బీపీసీ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్ చేయాలని విద్యార్దులతో పాటు వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని, ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాయిలో ఐసర్ విద్యా సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించిందన్నారు. ఎంఎస్ తరహాలోనే బీఎస్, ఎంఎస్ కోర్సులకూ మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సైన్స్ రంగంలో ఈ కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

Follow Us @