హైదరాబాద్ (ఎప్రిల్ – 22) : కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, మొహాలీ బరంపురం, భోపాల్, కోల్ కతా, పుణే, తిరువనంతపురంలో IISER నెలకొల్పారు.
ఇక్కడ ఐదేళ్ల వ్యవధి ఉండే బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు సైన్స్ ప్రాథమికాంశాలు బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్ అండ్ డీ.. సంస్థలు, సైన్స్ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్లు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్ కోర్సులు, ఎర్త్ సైన్స్ లు అభ్యసిస్తారు. ఆరు నెలలకు ఒకటి చొప్పున కోర్సు మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి.
◆ ప్రవేశ మార్గాలు
మొత్తం 3 మార్గాల్లో ప్రవేశాలు ఉంటాయి. అవి.. కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్డ్, ఆప్టిట్యూడ్ టెస్టు.
జేఈఈ ఛానెల్లో ప్రవేశం ఆశించేవారు 2023 కామన్ లేదా సంబంధిత కేటగిరీలో 15,000లోపు ర్యాంకు పొందాలి.
జేఈఈ అడ్వాన్స్ ప్రతిభ చూపినవారితో, కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనకు ఎంపికైనవారితో 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు.
మిగిలిన సీట్లను ఆప్టిట్యూడ్ టెస్టు ద్వారా నింపుతారు. ఐఐటీ-జేఈఈ, కేవీపీవై విభాగాలకు కేటాయించిన సీట్లు మిగిలిపోతే ఆప్టిట్యూడ్ లో ప్రతిభ చూపినవారితో వాటినీ భర్తీ చేస్తారు. కోరుకున్న విధానంలో ప్రవేశం పొందడానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
◆ పరీక్ష సన్నద్ధత
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 15 చొప్పున 60 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.
◆ అర్హతలు : ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుతో 2022 లేదా 2023లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55) శాతం మార్కులతో ఇంటర్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ : ఆప్టిట్యూడ్ టెస్టు, కేవీపీవై ఛానెళ్లలో మే 25 వరకు. జేఈఈ అడ్వాన్స్ జూన్ 25 నుంచి జూన్ 30 వరకు.
◆ దరఖాస్తు ఫీజు : రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000
◆ ఆప్టిట్యూడ్ పరీక్ష : జూన్ 17న.