పాలిసెట్ పరీక్ష ద్వారానే ట్రిపుల్ ఐటీ బాసర సీట్ల భర్తీ – నవీన్ మిట్టల్

తెలంగాణ రాష్ట్రం లోని బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (RJUKT) లో ఈ విద్యా సంవత్సరం ట్రిపుల్ ఐటి సీట్లను పాలిసెట్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాలిసెట్‌ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యా మండలి సవరించింది.

జూన్‌ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా, 100 ఆలస్య రుసుంతో జూన్‌ 27 వరకు, 300 ఆలస్య రుసుంతో జూన్‌ 30 వరకు దరఖాస్త చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు నవీన్‌ మిట్టల్ తెలిపారు.

పాలిసెట్‌ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నవీన్‌ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు.