- రెండోసారి కప్ ను ముద్దాడిన ఇంగ్లండ్
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ &సిరీస్ గా శ్యామ్ కర్రన్
మెల్‌బోర్న్ (నవంబర్ – 13) : మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టీట్వంటీ వరల్డ్ కప్ 2022 మెగా ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ పై 5 వికెట్లు తేడాతో గెలిచి విశ్వవిజేత గా నిలిచింది. ఇది ఇంగ్లండ్ జట్టుకు రెండవ టీట్వంటీ వరల్డ్ కప్… వెస్టిండీస్ కూడా రెండు సార్లు టీట్వంటీ వరల్డ్ కప్ లను గెలుచుకోవడం జరిగింది. అలాగే 2019లో వన్డే వరల్డ్ కప్ కూడా ఇంగ్లండ్ జట్టు గెలుచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. మసూద్ 38, బాబర్ 32 పరుగులతో రాణించగా, శ్యామ్ కర్రన్ 3, రషీద్, జోర్డాన్ లు తలో 2 వికెట్లతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే హెల్స్ వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ 52 పరుగులతో నాటౌట్ గా నిలబడి మరోసారి ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ ట్రోపి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. శ్యామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మరియు సిరీస్ గా నిలిచాడు.

◆ టోర్నమెంట్ విశేషాలు :
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ : శ్యామ్ కర్రన్
మ్యాన్ ఆఫ్ ద సిరీస్ : శ్యామ్ కర్రన్
అత్యధిక పరుగుల వీరుడు : విరాట్ కోహ్లీ (296)
అత్యధిక వికెట్ల వీరుడు : వానింద్ హర్షంగా (15)
అత్యధిక వ్యక్తిగత స్కోర్ : రిలీ రస్కో (109)
బెస్ట్ బౌలింగ్ : శ్యామ్ కర్రన్ (5/10)
Follow Us @