ICC WTC 2025 FINAL విశేషాలు, రికార్డులు

BIKKI NEWS (JUNE 15) : ICC WTC 2025 RECORDS. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025 విజేతగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఫైనల్ లో పటిష్టమైన డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి టెస్ట్ గదను చేజిక్కించుకుంది.

ICC WTC 2025 RECORDS

ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విశేషాలను, రికార్డులను పోటీ పరీక్షలు నేపథ్యంలో చూద్దాం.

1998 లో ఛాంపియన్స్ ట్రోఫీ (ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గింది.

గత 15 ఏళ్లలో ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఓడిపోవడం ఆస్ట్రేలియా కు ఇదే తొలిసారి.

వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ విజేతలు

2021 -న్యూజిలాండ్ (భారత్ పై)
2023 – ఆస్ట్రేలియా (భారత్ పై)
2025 – సౌతాప్రికా (ఆస్ట్రేలియా పై)

దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ గా తెంబా బవుమా సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను కెప్టెన్సీ వహించిన 10 మ్యాచులలో 9 విజయాలు ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఐసీసీ ఫైనల్ లో 10వ వికెట్ కు 59 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడి గా స్టార్క్ – హెజిల్‌వుడ్ రికార్డు సృష్టించారు.

ఐసీసీ టోర్నీ ఫైనల్ లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఎ. మార్క్రమ్ రికార్డు సృష్టించాడు.

ఐసీసీ టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా ఎ. మార్క్రమ్ రికార్డు సృష్టించాడు. తొలి ఆటగాడిగా అరవింద డిసిల్వా (1996) ఉన్నాడు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు