T20 World Cup : విశ్వవిజేత ఆస్ట్రేలియా

కేప్‌టౌన్ (ఫిబ్రవరి – 26) : మహిళలు టీట్వంటీ వరల్డ్ కప్ – 2023 విజేతగా ఆస్ట్రేలియా మహిళల జట్టు నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి మహిళల T20 ప్రపంచకప్ ఛాంపియన్ గా (icc-t20-women-world-cup-winner-australia) నిలిచింది. రెండో సారి హ్యాట్రిక్ విజయాలు సాదించింది.

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో 19 రన్స్ తేడాతో గెలుపొందింది. 157రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా వోల్వార్ట్ (61), ట్రయాన్(25) రాణించినా.. చివరిలో ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోయి 137/6కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కట్, గార్డ్నర్, బ్రౌన్, జొనాసెన్ తలో వికెట్ తీశారు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా బెత్ మూనీ, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఆష్లే గార్డెనర్ నిలిచారు.