ఆహ్మాదాబాద్ (నవంబర్ – 19) : ICC CRICKET WORLD CUP 2023 FINAL మ్యాచ్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 6వ సారి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ను ముద్దాడింది. భారత్ కు ఈ వరల్డ్ కప్ యాంటీ క్లైమాక్స్ గా మిగిలిపోయింది. ట్రావిస్ హెడ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ ఫైనల్ 2023 లో, మరియు వన్డే వరల్డ్ కప్ – 2023 లో విలన్ గా మారాడు.
241 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ (137) , లబూషేన్ (58*) మరో వికెట్ పడకుండా కాచుకుని మ్యాచ్ ని గెలిపించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా – 2, షమీ – 1, సిరాజ్ – 1 వికెట్ తీశారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారత జట్టు ను 240 పరుగులకే ఆలౌట్ చేసి కట్టడి చేసింది కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 47, కోహ్లీ 54, రాహుల్ 66 మినహా మిగతా వారెవరు రాణించలేదు.
రక్షణాత్మకంగా, నెమ్మదిగా సాగిన భారత ఇన్నింగ్స్ లో 11 నుండి 38 ఓవర్ల మధ్య కేవలం 2 బౌండరీలు మాత్రమే భారత్ బ్యాట్స్మెన్ సాధించారు. భారత బ్యాట్స్మెన్ ఎంత రక్షణాత్మకంగా ఆడారో దీనిని బట్టి అర్థం అవుతుంది.
మొదట్లో రోహిత్ శర్మ అందించిన వేగాన్ని తర్వాత బ్యాట్స్మెన్ అందిపుచ్చుకోవడంలో విపలమయ్యారు. అనవసరపు షాట్ కు శుభమన్ గిల్ తరువాత రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ – 3, హెజిల్‌వుడు – 2, కమ్మిన్స్ – 2, జంపా – 1, మ్యాక్స్‌వెల్ – 1వికెట్ తీశారు.