BIKKI NEWS (JULY 01) : IBPS CLERK JOB NOTIFICATION 2024. ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులలో 6,138 క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ – 14 (IBPS CRP – XIV) కింద ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 – 26 సంవత్సరంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 01 నుండి ప్రారంభమైంది.
IBPS CLERK JOB NOTIFICATION 2024
పోస్ట్ వివరాలు : IBPS CKERK
మొత్తం ఖాళీలు : 6,137
ఆంధ్రప్రదేశ్ ఖాళీలు – 105
తెలంగాణ ఖాళీలు – 104
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : జూలై – 01 – 2024 నుంచి
దరఖాస్తు ముగింపు తేదీ : జూలై – 28 – 2024 వరకు
వయోపరిమితి : 20 – 28 సంవత్సరాల మద్య ఉండాలి. ( రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
అర్హతలు : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 850/- రూపాయలు (SC, ST, PwD, ESM, DESM – 175/- రూపాయలు మాత్రమే)
ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికను చేయబడతారు.
ప్రిలిమినరీ పరీక్ష విధానం : 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. (ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30, న్యుమరీకల్ ఎబిలిటి – 35, రీజనింగ్ ఎబిలిటి – 35)
మెయిన్స్ పరీక్ష విధానం : మొత్తం 200 మార్కులకు ఉంటుంది. జనరల్/ ఫైనాన్స్ ఎవేర్‌నెస్ – 50, జనరల్ ఇంగ్లీష్ – 40, రీజనింగ్ ఎబిలిటి / కంప్యూటర్ ఆప్టిట్యూడ్ – 60, క్వాంటీటేటీవ్ ఆప్టిట్యూడ్ – 50.
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ షెడ్యూల్ : 2024 ఆగస్టు 12 నుండి ఆగస్టు 17 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : ఆగస్టు 24, 25, 31 – 2024 లో నిర్వహించనున్నారు.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు : సెప్టెంబర్ 2024
మెయిన్స్ పరీక్ష తేదీలు : అక్టోబర్ – 2024
పోస్టింగ్స్ తేదీ : ఎప్రిల్ – 2025 నుంచి