5,830 బ్యాంకు క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన IBPS

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(IBPS) దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 5,830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు…

★ మొత్తం పోస్టుల సంఖ్య: 5830

తెలంగాణ ౼ 263
ఆంధ్రప్రదేశ్‌ ౼ 263

★ క్లర్క్ పోస్టులు భర్తీ చేసే బ్యాంకులు ::

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
  • ఇండియన్‌ బ్యాంక్
  • ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
  • కెనరా బ్యాంక్
  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
  • పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్
  • యూకో బ్యాంక్
  • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

● అర్హతలు :: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

● వయోపరిమితి :: జూలై – 01 – 2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.

● ఎంపిక పద్దతి :: ఆన్లైన్‌ విధానంలో పరీక్షలు ఆధారంగా ప్రిలిమినరీ(100మార్కులు), మెయిన్‌(200మార్కులు)
నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌ పరీక్ష మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

● దరఖాస్తు పద్ధతి :: ఆన్లైన్‌లో విదానంలో

● దరఖాస్తుల ప్రారంభ తేది :: జూలై – 12 – 2021

● దరఖాస్తు చివరి తేది :: ఆగస్టు – 01 – 2021

● ఆన్లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు :: ఆగస్టు 28, 29మరియు సెప్టెంబర్‌ 4న

● ఆన్లైన్‌ మెయిన్‌ పరీక్ష తేదీ :: అక్టోబర్ – 31- 2021

● వెబ్సైట్‌ :: https://www.ibps.in