7800 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇక్కడ అప్లై చేయండి

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) 7800 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్లైన్‌ దరఖాస్తులు ఈ నెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది జూన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరల దరఖాస్తు చేయనవసరం లేదు. అలాగే ప్రిలిమ్స్‌, మెయిన్స్ పరీక్షలు హిందీ, ఇంగ్లీషు తో పాటు13 ప్రాంతీయ భాషలలో నిర్వహించనున్నారు.

● మొత్తం పోస్టులసంఖ్య :: 7800

● అర్హతలు :: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. అలాగే స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి.

● వయోపరిమితి :: అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్యవారై ఉండాలి.

● ఎంపిక ప్రక్రియ :: రాత పరీక్ష ద్వారా

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌ ద్వారా

● అప్లికేషన్‌ ఫీజు :: ₹ 850., ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ₹ 175.

● దరఖాస్తు ప్రారంభం తేదీ :: అక్టోబర్‌ – 07 – 2021

● చివరి తేదీ :: అక్టోబర్‌ – 27 – 2021

● ప్రిలిమ్స్‌ పరీక్ష :: డిసెంబర్‌ 2021

● మెయిన్స్‌ :: 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో

● వెబ్సైట్‌ :: ibps.in