BIKKI NEWS (JUNE 18) : I LOVE PAKISTAN SAYS DONALD TRUMP. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
I LOVE PAKISTAN SAYS DONALD TRUMP
“భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను… ఐ లవ్ పాకిస్తాన్… రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడా ట్రేడ్ గురించి చర్చించా” అని ట్రంప్ ప్రకటించారు
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను తానే ఆపానని అని మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలు కావడంతో యుద్ధాన్ని తానే ఆపానని నొక్కి వక్కాణించారు.
పాకిస్తాన్ నుండి ఆసిఫ్ మునీర్ భారతదేశం నుండి నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రకటించారు
ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ తో ఫోన్ కాల్ మాట్లాడిన సంగతి తెలిసిందే. అనంతరం భారత విదేశాంగ శాఖ కాశ్మీర్ విషయంలో విదేశీ జోక్యం లేదని కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదని మోడీ ట్రంప్ తో స్పష్టం చేశారని ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ మళ్లీ నేనే యుద్ధాన్ని ఆపాను అని ప్రకటించడం చర్చనీయాంశం అయింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్