BIKKI NEWS (FEB. 06) : భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో ను హ్యుందాయ్ కంపెనీ (HYUNDAI IPO) తీసుకురానుంది. మార్కెట్ నుంచి 25 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా ఈ ఐపీవో రానుంది.
ఇప్పటి వరకు ఎల్ఐసీ పేరు మీద అతిపెద్ద ఐపీవో (LIC IPO) ఉంది. ఎల్ఐసీ 21 వేల కోట్ల సేకరణ కోసం 2022 లో ఐపీవో తీసుకువచ్చి లాభాలతో విజయవంతంగా దూసుకుపోతుంది.
2024 చివర్లో హ్యుందాయ్ ఐపీవో మార్కెట్ లో లిస్ట్ కానుంది. దేశంలో మారుతి సుజుకి తర్వాత అతిపెద్ద మార్కెట్ హ్యుందాయ్ సొంతం.
★ క్యూ లో మరిన్ని ఐపీవో లు
సెబీ వద్ద ఇప్పటికే 66 కంపేనీలు ఐపీవో కోసం దరఖాస్తు చేసుకోగా, 25 సంస్థలకు అమోదం లభించింది. ఈ 66 సంస్థల ఐపివో విలువ సుమారు 72 వేల కోట్లు అని అంచనా. కాగా గతేడాది 57 కంపేనీలు ఐపీవో కి రాగా 49,434 కోట్లు సేకరణ జరిగింది.
★ ఐపీవో కు రానున్న ముఖ్య సంస్థలు
ఓలా ఎలక్ట్రిక్
ఆఫీస్
మొబిక్విక్
ప్రోటీ
ఓరావెల్ సెస్
జనరల్ ఇన్సూరెన్స్
గో డిజిట్
బ్రెయిన్ బీస్సొల్యూషన్స్