హైదరాబాద్ డీఐఈవో గా బాధ్యతలు స్వీకరించిన ఒడ్డెన్న కు శుభాకాంక్షలు తెలిపిన 508 సంఘ నాయకులు

హైదరాబాద్ జిల్లా డీఐఈవో గా ఈ రోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దాసరి ఒడ్డెన్న కు హైదరాబాద్ జిల్లా ఆర్జేడీ యూనియన్ సభ్యులు డీఐఈవో కార్యాలయం నందు కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ జిల్లా నాయకులను పరిచయం చేయడం జరిగింది. మరియు 70 కి పైగా ఆన్లైన్ తరగతులను సివిక్స్ మరియు హీస్టరీ సబ్జెక్టుల యందు బోధించిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు అయినా అనిల్ రెడ్డి మరియు రామ్మోహన్ లను ఈ సందర్భంగా డీఐఈవో ఒడ్డెన్న అభినందించి, కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెసిడెంట్.ఆంజనేయులు, సెక్రటరీ తిరుపతి, హిరణ్య, రామ్మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, అనిల్ రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Follow Us@