హైదరాబాద్ (జనవరి – 15) : హైదరాబాద్ రాజ్యం ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు
ముకరం ఝా.. హైదరాబాద్ చిట్టచివరి ఏడో నిజాం రాజు అయిన మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడు. మిర్ హిమాయత్ అలీ ఖాన్ వురపు అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్ టర్కీ (ఒట్టోమన్ సామ్రాజ్యం) చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె కావడం గమనార్హం. కాగా, 1954, జూన్ 14న ప్రిన్స్ ముకరం ఝాను మిర్‌ఉ స్మాన్ అలీఖాన్ తన వారసుడిగా ప్రకటించాడు. దీంతో 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా పిలువబడ్డాడు. 1954 నుంచి ముకరం ఝా హైదరాబాద్‌కు ఎనిమిదో రాజుగా గుర్తింపు పొందాడు.