HURUN INDIA PHILANTHROPIST LIST 2024 – రోజుకు 5.9 కోట్లు దానం చేస్తున్న శివ్ నాడార్

BIKKI NEWS (NOV. 07) : HURUN INDIA PHILANTHROPIST LIST 2024. ఎడిల్ గివ్ హరున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ -2024 ప్రకారం భారతదేశంలో దాతృత్వంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ (SHIV NADAR) మొదటి స్థానంలో నిలిచారు. గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో ఉన్నారు.

HURUN INDIA PHILANTHROPIST LIST 2024

  1. శివ్ నాడార్
  2. ముకేశ్ అంబానీ
  3. బజాజ్ కుటుంబం
  4. కూమర మంగళం బిర్లా
  5. గౌతమ్ అదాని
  6. నందన్ నీలేకని
  7. కృష్ణ చివుకుల
  8. అనిల్ అగర్వాల్
  9. సుచిత్ర – సుబ్రతో భాగ్చి
  10. రోహిణి నిలేకని

శివ్ నాడార్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్ల విరాళాలు ఇచ్చారు. అంటే ప్రతి రోజూ రూ.5.9 కోట్లు విరాళం ఇస్తూ వచ్చారని హురూన్ ఇండియా పేర్కొంది. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలు అందజేశారు.

ఇక మహిళల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని సతీమణి రోహిణి నిలేకనీ మొదటి స్థానంలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.154 కోట్ల విరాళాలు అందజేశారు. రోహిణి నిలేకని ఫిలాంత్రఫీస్ అనే ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్న సంస్థలకు, పర్యావరణ సుస్థిరత కోసం విరాళాలు అందజేస్తుంటారు.

దాతల్లో పిన్న వయస్కుడు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (38) మొదటి స్థానంలో ఉంటారు. మానసిక ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, విద్యా రంగం కోసం విరాళాలు ఇస్తారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎడిల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ -2024లో 203 మంది దాతలు రూ.8,783 కోట్ల విరాళాలు ఇచ్చారు. రెండేండ్ల క్రితంతో పోలిస్తే 55 శాతం విరాళాలు పెరిగాయి.

18 మంది దాతలు రూ100 కోట్ల పై చిలుకు విరాళాలు ఇచ్చారు.

30 మంది దాతలు రూ.50 కోట్ల పైచిలుకు (2019 నుంచి 125 శాతం వృద్ధి) దానం చేశారు

61 మంది దాతలు రూ.20 కోట్ల పై చిలుకు (ఐదేండ్ల క్రితంతో పోలిస్తే 128 శాతం వృద్ధి) విరాళాలు అందజేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు