కేంద్రీయ విద్యాలయ, నవోదయాల్లో 15వేల టీచింగ్ ఖాళీలు : కేంద్ర విద్యా శాఖ

  • లోక్ సభలో కేంద్ర విద్యా శాఖ వెల్లడి

న్యూఢిల్లీ (జూలై 26) : దేశంలోని 2021 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 12 వేలు నవోదయ పాఠశాలల్లో 3 వేలకు పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్ లో వెల్లడించింది.

కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) 9 వేల మందికి పైగా టీచర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సోమవారం లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు.

బదిలీలు, పదవీ విరమణల కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. భర్తీ ప్రక్రియ నిరంతం ప్రక్రియ అని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Follow Us @