మోడల్ స్కూల్ లలో అవర్లీ బేసిస్ టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి – PMTA – TS

గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న అవర్లీ బేసిస్ టీచర్ల (HBT)ను కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఇంకా విధుల్లోకి తీసుకోలేదు.

అయితే ఇప్పుడు ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు తగు న్యాయం జరగాలంటే అవర్లీ బేసిస్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ కోరారు. అలాగే సెప్టెంబర్ నుండి వారు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్పటి నుండి వేతనాలు చెల్లించాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు వారంలోగా వారి పునర్నియామకం ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు జగదీశ్ చెప్పారు.

Follow Us@