HOLIDAY : ఆగస్టు 29,30 విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్ (జూలై – 14) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆగస్టు 29 , 30 తేదీలలో నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల ఉన్న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఈ గ్రూప్ – 2 పరీక్షలకు 5.5 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో పాటు ..పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.