HOLIDAY : నవంబర్ – 2, 3వ తేదీలలో సెలవు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు నేపథ్యంలో నవంబర్ 2, 3వ తేదీలలో పరీక్షా కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు సెలవు (holiday on November 2nd and 3rd in telangana) ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 2, 3వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం సెషన్స్ లలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలకు సెలవు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పరీక్షా కేంద్రాలలో పూర్తి ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.