చెన్నై (ఆగస్టు – 11) : హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 (hockey asian champions trophy 2023) సెమీఫైనల్ లో భారత్ ఘనవిజయం సాదించింది. జపాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 5 – 0 తేడాతో ఘన విజయం సాధించింది.
గోల్ కొట్టేందుకు జపాన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మొదట్నుంచి టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు.. దీంతో 5-0 తేడాతో జపాను మట్టికరిపించింది.
సెమీఫైనల్లో విజయంతో ఫైనల్ చేరిన భారత్… ఫైనల్ లో మలేషియాతో తలపడనుంది.