ఇంటర్ విద్యాభోధనలో చరిత్ర సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి

  • శ్రీమతి రమణి యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్ అధికారి.

యాదాద్రి (జూలై – 21) : యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్ కార్యాలయం యందు గురువారం రోజున చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ HEC కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన వాల్ పోస్టరును జిల్లా నోడల్ అధికారి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా నోడల్ అధికారి మాట్లాడుతూ ఇంటర్ విద్యాబోధనలో చరిత్ర సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన విద్యార్థులలో మానవీయ, నైతిక విలువలు పెంపొందడంతో పాటు పోటీ పరీక్షల యందు రాణించే అవకాశం ఉందన్నారు. ఇంటర్ విద్య వ్యవస్థలో పనిచేస్తున్న చరిత్ర జూనియర్ లెక్చరర్లు సమాజంకు ఉపయోగపడే సబ్జెక్టు చరిత్ర పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయం అని చెపుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చరిత్ర పరిరక్షణ ఉద్యమంకు తనవంతు సహాయ సహకారం అందిస్తాను అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డీ.పాపిరెడ్డి, ఏ. సుచిత్ర జూనియర్ లెక్చరర్ బోటనీ, ఎ. మురళి జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ , రమేష్ జూనియర్ లెక్చరర్ చరిత్ర , అవనిధర్ జూనియర్ లెక్చరర్ పొలిటికల్ సైన్స్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us @