స్వరాష్ట్రములో చరిత్ర సబ్జెక్టుకు సమూచిత స్థానం ఏది?! – డా.తిరుపతి పోతరవేణి

  • డా.తిరుపతి పోతరవేణి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ చరిత్ర పరిరక్షణ సమితి

ఇటీవల మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉజ్వలమైనది అని, ఈ ప్రాంతం అనేక మంది చారిత్రక వ్యక్తులకు పుట్టినిల్లు మరియు చారిత్రక కట్టడాలకు నిలయం అని చెబుతూ, గత పాలకులు పట్టించుకోలేకపోవడం వలన తెలంగాణ చరిత్ర సంస్కృతి నిరారదరణకు గురైందని, తెలంగాణ చరిత్ర సంస్కృతి పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ వేసి, అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటుందని ప్రకటించడం హర్షనీయం. ప్రభుత్వం చేపట్టే చారిత్రక కట్టడాల పరిరక్షణ ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఆదాయం రావచ్చు. కానీ భావి తరాలకు చెందిన కాలేజీ విద్యార్థులకు, యువతకు తెలంగాణ చరిత్ర సంస్కృతి పట్ల, చారిత్రక కట్టడాల పట్ల, చారిత్రక వ్యక్తుల పట్ల సరైన అవగాహన కల్పించకపొతే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోలేమని చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వం ముందుగా కాలేజీ స్థాయి విద్యా బోధనలో విద్యార్థులకు చరిత్రను ఒక తప్పనిసరి పాఠ్యంశంగా ప్రవేశ పెట్టి భోదించవలసిన అవసరం మరియు చరిత్ర పరిశోధనలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ చరిత్ర సంస్కృతి పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ వేసి, అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ ప్రకటించడం హర్షనీయం.

స్వరాష్ట్రము సిద్దించి కెసిఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి కాలేజీ స్థాయి విద్య పురొగమన దిశలో నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెరాస ప్రభుత్వం బడుగు, బలహీన మరియు పేద వర్గాల పిల్లలకు పోషకాహారంతో పాటు ముఖ్యంగా నాణ్యమైన ఇంటర్ విద్యను అందుబాటులో తీసుకోని రావాలనే ఉద్దేశ్యంతో అనేక పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నది. గత రెండు ఏండ్లలోనే 138 బీసీ వెల్ఫేర్ పాఠశాలలను బిసి జూనియర్ కళాశాలలుగా,204 మైనారిటీ పాఠశాలలను మైనారిటీ జూనియర్ కళాశాలలుగా, 208 కేజీవీబీ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా, 119 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలను సోషల్ జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ, ఆయా కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను అందించుటకు చేస్తున్న కృషి ప్రశంసనీయంగా పేర్కొన్నవచ్చు. కానీ ఆయా జూనియర్ కళాశాలలలో ప్రవేశ పెట్టిన ఇంటర్మీడియట్ కోర్సుల యందు మన దేశ చరిత్ర సంస్కృతితో పాటు తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలియజేసే చరిత్ర సబ్జెక్టుకు సంబందించిన HEC కోర్సును ప్రవేశ పెట్టకపోవడం శోచనీయం. గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు చరిత్ర సబ్జెక్టు పట్ల వివక్షత చూపినట్లే కెసిఆర్ ప్రభుత్వం కూడ ఇంటర్ విద్యలో చరిత్ర సబ్జెక్టుకు సమూచిత స్థానం ఇవ్వడం లేదని చరిత్ర అధ్యాపకులు, పరిశోధకులు, చరిత్ర అభిమానులు వాపోతున్నారు.

బీసీ, సోషల్, మైనారిటీ, కేజీవీబీ, ట్రైబల్ మొదలగు సంస్థల క్రింద నడిచే దాదాపు 580 పాఠశాలలను జూనియర్ కళాశాలలు గా అప్గ్రేడ్ చేసినారు. కానీ ఆయా జూనియర్ కళాశాలల యందు చరిత్ర సబ్జెక్టుకు సంబందించిన కోర్సు ప్రవేశ పెట్టలేదు

ఉమ్మడి పాలకుల వివక్షత వలన తెలంగాణ చరిత్ర సంస్కృతితో పాటు విద్యా రంగంలో చరిత్ర సబ్జెక్టు కూడా పూర్తిగా విస్మరించిబడిందని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు కూడ తమ హయంలో అనుమతి ఇచ్చిన దాదాపు 294 మోడల్ జూనియర్ కళాశాలలో, 80 ప్రభుత్వ జూనియర్ కళాశాలల యందు HEC గ్రూప్ ప్రవేశ పెట్టలేదు. అంతేకాక ఆ కాలంలో జరిగిన జూనియర్ లెక్చరర్ల భర్తీలో చరిత్ర జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ చెయ్యలేదని తెలంగాణ ఉద్యమకారులు గగ్గోలు పెట్టిన విషయం మన అందరికి విదితమే.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకు ఊపిరి ఊదినా సబ్జెక్టులలో చరిత్రనే ముఖ్యమైనది. 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు, 2001 నుండి జరిగిన మలిదశ ఉద్యమకారులు చరిత్ర సబ్జెక్టును ప్రధాన ఆయుధంగా వాడుకొని నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణ చారిత్రక సంపద పట్ల, సంస్కృతి పట్ల మనకు జరిగిన అన్యాయమును విడమర్చి చెప్పినారు. కళాకారులు ధూమ్ ధామ్ వంటి కార్యక్రమాలలో తమ ఆట, పాటల ద్వారా గ్రామీణ ప్రజలును ఏవిదంగా చైతన్యము చేసినారో, మేధావులు వివిధ వేదికలపై చరిత్ర సబ్జెక్టును ఉపయోగించుకొని, తమ ప్రసంగాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను యువకులను, సబ్బండ వర్ణాల వారిని చైతన్యం కల్గించి ఉద్యమ కార్యోముఖులను చేసినారు. ఆంధ్ర పాలకులు చేసిన దోపిడీనీ పూర్తిగా చరిత్ర సబ్జెక్టు ఆధారంగానే ప్రతి ఒకరు తెలుసుకోగల్గినారు అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకు ఊపిరి ఊదినా సబ్జెక్టులలో చరిత్రనే ముఖ్యమైనది. 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు, 2001 నుండి జరిగిన మలిదశ ఉద్యమకారులు చరిత్ర సబ్జెక్టును ప్రధాన ఆయుధంగా వాడుకొని నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణ చారిత్రక సంపద పట్ల, సంస్కృతి పట్ల మనకు జరిగిన అన్యాయమును విడమర్చి చెప్పినారు.

మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకు నాయకత్వం వహించిన కెసిఆర్ చరిత్ర సబ్జెక్టును ఔపోసన బట్టి గాంధీజీ జరిపిన జాతీయోద్యమం వలె తెలంగాణ ఉద్యమం నడిపినారు. అంతేకాక ఉద్యమం సందర్బంగా పలు వేదికల మీద, మాట్లాడుతూ ఉమ్మడి వలస పాలకుల వలన తెలంగాణ చరిత్ర సంస్కృతితో పాటు విద్యా వ్యవస్థలో చరిత్ర సబ్జెక్టు చీకటిలోకి వెట్టివేయబడిందనీ పేర్కొంటూ, అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ చరిత్రను పునర్నిర్మాణం చేసి లేదా నూతన తెలంగాణ చరిత్రను లిఖింపచేసి కళాశాల స్థాయి విద్యా బోధనలో అన్ని రకాల కోర్సులయందు తప్పనిసరి చరిత్ర పాఠ్యంశం పెట్టేలా చర్యలు తీసుకుంటాము అని పేర్కొన్నారు.స్వరాష్ట్రములో అధికారం చేపట్టిన తర్వాత కెసిఆర్ అసెంబ్లీలో కూడ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యతను వివరిస్తూ ఉద్యమం చరిత్రతో పాటు తెలంగాణ వైతాళికుల జీవిత చరిత్రలను గ్రంధాలుగా అందుబాటులోకి తెస్తామని, వీరు గురించి బావి తరాల వారికి భోధించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకు నాయకత్వం వహించిన కెసిఆర్ చరిత్ర సబ్జెక్టును ఔపోసన బట్టి గాంధీజీ జరిపిన జాతీయోద్యమం వలె తెలంగాణ ఉద్యమం నడిపినారు.

కెసిఆర్ గారు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు పెట్టె పేర్లు చరిత్రను ఆధారంగా చేసుకొని ఉంటున్నాయి. పరిపాలన పరంగా అశోకునీ వలె పర్యావరణ పరిరక్షణ కై హరితహారం వంటి కార్యక్రమాలు, కాకతీయుల పాలనను ఆదర్శంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నారు. అంతేకాక యాదాద్రి వంటి గొప్ప దేవాలయం పునర్ నిర్మాణం చేస్తున్నారు.
కానీ గత రెండు యేండ్లలో బీసీ, సోషల్, మైనారిటీ, కేజీవీబీ, ట్రైబల్ మొదలగు సంస్థల క్రింద నడిచే దాదాపు 580 పాఠశాలలను జూనియర్ కళాశాలలు గా అప్గ్రేడ్ చేసినారు. కానీ ఆయా జూనియర్ కళాశాలల యందు చరిత్ర సబ్జెక్టుకు సంబందించిన కోర్సు ప్రవేశ పెట్టలేదు. కెసిఆర్ అమితంగా ఇష్టపడే చరిత్ర సబ్జెక్టు ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యా భోధనలో ఎందుకు విస్మరించబడుతుందో అని చరిత్ర అభిమానులు కలవరపడుతున్నారు. అధికార వర్గం కూడా విద్యా బోధనలో చరిత్ర సబ్జెక్టు పట్ల వివక్షత చూపడం కూడా విస్మయం కల్గిస్తుంది.

సీఎం కెసిఆర్ చొరవ తీసుకోని చారిత్రక సంపద పరిరక్షణ కంకణం కట్టుకున్నట్లే అప్గ్రేడ్ చేసిన అన్ని బిసి, ఎస్సి, ట్రైబల్, మైనారిటీ మరియు కేజీవీబీ జూనియర్ కళాశాలలో చరిత్ర తప్పసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టాలి

ప్రస్తుతం సీఎం కెసిఆర్ చొరవ తీసుకోని చారిత్రక సంపద పరిరక్షణ కంకణం కట్టుకున్నట్లే అప్గ్రేడ్ చేసిన అన్ని బిసి, ఎస్సి, ట్రైబల్, మైనారిటీ మరియు కేజీవీబీ జూనియర్ కళాశాలలో చరిత్ర తప్పసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టి, కాలేజీ స్థాయి విద్యా బోధనలో చరిత్ర సబ్జెక్టుకు సమూచిత స్థానం కల్పించాలని చరిత్ర నిరుద్యోగులు, అధ్యాపకులు, ప్రొఫెసర్స్, పరిశోధకులు మరియు చరిత్ర అభిమానులు వేడుకుంటున్నారు.

వ్యాసకర్త :

డా.తిరుపతి పోతరవేణి

9963117456

Follow Us @