సెప్టెంబర్ 27 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం: 1980 నుండి సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా United Nations World Tourism Organization (UNWTO) ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం.

◆ సంఘటనలు :

1821: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
2008: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
2008: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు.

◆ జననాలు :

1898: కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967)
1909: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969)
1915: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012).
1933: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009)
1936: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009)
1953: మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ మరణాలు :

1719: జార్జ్ స్మాల్రిడ్జ్, బ్రిస్టల్ ఇంగ్లీష్ బిషప్. (జ.1662)
1833: రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు (జ.1772).
1939: దాసు విష్ణు రావు, న్యాయవాది. (జ.1876)
1972: గోగినేని భారతీదేవి, స్వతంత్ర సమర యోధురాలు, సంఘ సేవిక (జ.1908).
2001: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920).
1996: నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు (జ.1947).
1997: మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926).

Follow Us @